HomeTelugu Newsమహేష్‌ సినిమాలో రకుల్ కు మరో ఛాన్స్

మహేష్‌ సినిమాలో రకుల్ కు మరో ఛాన్స్

సూపర్‌ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్‌ షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్‌ త్వరలో మరో భారీ షెడ్యూల్‌ కోసం ఫారిన్‌ వెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే 25వ సినిమా సెట్స్‌లో ఉండగానే తరువాత సినిమాను కూడా సిద్ధం చేస్తున్నాడు మహేష్‌‌. తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేసేందుకు సెన్‌ సైన్‌ చేశాడట.

3 19

రంగస్థలం సినిమాతో మంచి విజయం సాధించి ఫాంలో ఉన్న సుకుమార్, మహేష్ కోసం ఆసక్తికర కథను సిద్ధం చేశారట. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్న మహేష్‌ 25 చిత్రం పూర్తయిన వెంటనే సుకుమార్‌ సినిమా పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న రకుల్ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌ గా నటించనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్పైడర్‌ మూవీ షూటింగ్ సమయంలో రకుల్ కు మరో ఛాన్స్‌ ఇస్తానని మహేష్‌ మాట ఇచ్చాడట. తాను ఇచ్చిన మాట ప్రకారం సుకుమార్‌ సినిమాలో ఛాన్స్‌ ఇస్తున్నారంటూ.. టాక్‌ వినిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu