HomeTelugu Trendingలేటు వయసులో ఘాటు పాత్రలో టబు

లేటు వయసులో ఘాటు పాత్రలో టబు

tabu
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ టాబు తెలుగులో నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ సరసన నటించింది. వెంకటేష్‌తో కూలీ నెం.1 సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. 2008లో బాలకృష్ణతో పాండురంగడు సినిమా తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. అలవైకుంఠపురములో సినిమాతో మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా బాలీవుడ్‌లో కామసూత్ర డైరెక్టర్ మీరా నాయర్ తెరకెక్కిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో టాబు నటించింది. నలభై ఏళ్ల పైబడిన సెక్స్‌వర్కర్‌ పాత్రను పోషించింది. ఆమెను ప్రేమించే 20 ఏళ్ల కుర్రాడి పాత్రలో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ నటించాడు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది కథాంశం. ‘ఎ సూటబుల్‌బాయ్‌’ అనే ఈ వెబ్‌ సిరీస్‌తో బీబీసీ సంస్థ ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ నెల 26 నుంచి బీబీసీలో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమ్‌ కానుంది. హిందీతో పాటు ఇంగ్లిష్‌లోనూ విడుదల కాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ కూడా విడుదలైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu