HomeTelugu Trendingఅభిమానులకు నాగచైతన్య స్పెషల్‌ గిఫ్ట్‌

అభిమానులకు నాగచైతన్య స్పెషల్‌ గిఫ్ట్‌

2 23టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య తన అభిమానులకు ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో చైతన్యకు జంటగా సాయిపల్లవి కనిపించనున్నారు. శనివారం చై పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమాలోని ఆయన పాత్రను తెలియజేస్తూ ఫస్ట్‌ గ్లిమ్స్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

”నాగచైతన్య 19′ ప్రపంచంలోకి స్వాగతం. ఆ ప్రపంచం నాకు ఇల్లులాంటిది. సింపుల్‌, బ్యూటీఫుల్‌, శేఖర్‌ కమ్ములకు ధన్యవాదాలు.” అని చై పేర్కొన్నారు. ఈ చిత్రంలో చై ఓ మధ్య తరగతి అబ్బాయిలా కనిపించనున్నట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. పవన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu