మరోసారి వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్‌‌..!

వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో నువ్వునాకు నచ్చావ్ ఒకటి. ఈ సినిమాకు విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. సినిమాలో పంచ్ డైలాగులు .. వెంకటేష్.. సునీల్ ల మధ్య వచ్చే డైలాగులు నవ్వులు పండించాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్నట్టుగా తెలుస్తున్నది. త్రివిక్రమ్ ప్రస్తుతం అరవింద సమేత సినిమాలో బిజీగా ఉండగా, వెంకటేష్ ఎఫ్2, వెంకీ మామ సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా పూర్తయినాక, వెంకటేష్ తో సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. జాలి ఎల్ఎల్బి 2 సినిమాను రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, త్రివిక్రమ్ రీమేక్ జోలికి వెళ్లేందుకు ఆసక్తి చూపించాడు. ఫ్రెష్ కథతోనే సినిమా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.