ఆ ఫైట్ కోసం మూడు కోట్లు..!

మహేష్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే
ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా లొకేషన్స్ ను వెతిలో
పనిలో ఉన్నాడు దర్శకుడు మురుగదాస్. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర
వార్త ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో ఓ ఫైట్ ఉంటుందట. దీనికోసం
అక్కడ టెక్నీషియన్స్ ను పిలిపించి మరీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క ఫైట్ కోసం
సుమారుగా మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. కార్ ఛేజింగ్, బీచ్ లో
బోట్ డ్రైవింగ్ వంటి యాక్షన్ సీన్స్ తో ఈ ఫైట్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
మరి ఈ ఫైట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే!

CLICK HERE!! For the aha Latest Updates