HomeTelugu Trendingఆది 'జోడి' మూవీ ట్రైలర్‌

ఆది ‘జోడి’ మూవీ ట్రైలర్‌

1 28యంగ్‌ హీరో ఆది నటిస్తున్న చిత్రం ‘జోడి’. జెర్సీ సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. విశ్వనాథ్‌ అరిగెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదలచేశారు. కుటుంబ విలువలతో కూడిన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. క్రికెట్‌ బెట్టింగ్‌ మీద ఆసక్తి ఉన్న తండ్రి పాత్రలో నరేష్‌ కనిపించనున్నారు. ఈ ట్రైలర్‌లోని సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. పద్మజ, సాయి వెంకట గుర్రం నిర్మాతలుగా వ్యవహారిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, విద్యుల్లేఖ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల ఆది నటించిన ‘బుర్రకథ’ చిత్రం ప్రేక్షకుల మందుకు వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu