Daaku Maharaj target collections:
నందమూరి బాలకృష్ణ మాస్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాబీ డియోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మొదటి పాట “ది రేజ్ ఆఫ్ డాకు” పెద్ద హిట్ అవ్వగా, రెండవ పాట “చిన్ని చిన్ని” కూడా అందర్నీ ఆకట్టుకుంది.
View this post on Instagram
మూడవ పాట దబిడి దిబిడి పై మాత్రం కొంత నెగటివ్ టాక్ వస్తోంది. ఈ పాటలో బాలకృష్ణ ఊర్వశి డాన్స్ స్పీడ్‌ను మ్యాచ్ చేయలేకపోయారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట కోసం కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ స్టెప్స్ కూడా తీవ్రంగా విమర్శలకు గురవుతున్నాయి.
మరోవైపు ఈ సినిమా బిజినెస్ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నైజాం రైట్స్‌ను దిల్ రాజు ₹18 కోట్లకు కొనుగోలు చేశారు. ఏపీ సీడెడ్ మినహా హక్కులు ₹40 కోట్లకు అమ్ముడయ్యాయి. సీడెడ్ ఏరియాలో ₹16 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు ₹4 కోట్లకు, ఇతర రాష్ట్ర హక్కులు ₹1 కోట్లకు అమ్ముడయ్యాయి.
ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరగడంతో సినిమా అన్ని ప్రాంతాల్లో టార్గెట్ రీచ్ అయ్యి భారీ కలెక్షన్స్ తెస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇంత బిజినెస్ చేసినా, సినిమా మీద కొందరు యావరేజ్ టాక్ ఉన్నట్లు చెబుతున్నారు. కానీ బాలయ్య మాస్ ఫ్యాన్స్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.
ALSO READ: Pushpa 2 తో పోలిస్తే Game Changer చేస్తున్న తప్పు ఇదేనా?