కౌశల్ ని టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు, ఫినాలేకి కౌశల్‌ వద్దు!!

తెలుగు బిగ్‌బాస్ సీజన్‌-2 లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. 17 మంది కంటెస్టెంట్స్‌లో ఫైనల్ వార్‌కి ఐదుగురు ఫినాలేకి చేరడంతో బిగ్ బాస్ సీజన్ 2 ఆసక్తిగా మారింది. సామ్రాట్, కౌశల్, దీప్తి, గీతా మాధురి, తనీష్‌లలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కాబోతున్నదెవరో మరో ఆరు రోజుల్లో తేలిపోనుంది. సోమవారం నాటి 106వ ఎపిసోడ్‌ హైలైట్స్ విషయానికి వస్తే.. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో కౌశల్ చెప్పిన వేటగాడు.. బాణాలు.. వేట కథకి కొనసాగింపు ఇచ్చారు కంటెస్టెంట్స్.

ఫినాలేకి చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్‌కు డబ్బులతో స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు బిగ్ బాస్. ఇక కంటెస్టెంట్స్ ఫైనల్‌కు చేరుకోవడంతో కాస్త రిలాక్స్ మూడ్‌లో కనిపించారు. సరదా సరదా జోకులతో ఎపిసోడ్‌ను ప్రారంభించినప్పటికీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌తో సీరియస్‌గా మారింది.

ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్‌లో ఉప్పు నిప్పుగా ఉన్న కౌశల్, తనీష్‌లు పక్క పక్కనే కూర్చుని పాత ప్రేమ కథల్ని గుర్తు చేసుకున్నారు. నీ లైఫ్‌లో ఏం లవ్ స్టోరీలు లేవా? అని కౌశల్‌ని అడగడంతో నేను ఇంటర్‌లో ఉండగా ఓ అమ్మాయిని ప్రపోజ్ చేశా అంటూ తన ప్రేమకథను చెప్పకొచ్చారు. ఇక కౌశల్ – దీప్తిల మధ్య హౌస్‌లో ఉన్న రిలేషన్స్, బాండింగ్‌ల గురించి సీరియస్ డిస్కషన్స్ ఎప్పటిమాదిరే జరుగుతుండగా.. బిగ్ బాస్ నుండి కంటెస్టెంట్స్ మధ్య ఫిటింగ్ పెట్టే అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీని ప్రకారం ఫినాలేకి వెళ్లిన మీ ఐదుగురిలో ఫైనల్‌లో మీతో పాటు ఎవరు ఉండాలనుకుంటున్నారు.. ఎవరు ఉండకూడదనుకుంటున్నారో తెలియజేస్తూ.. బోర్డ్ పై ఉంచిన ఫోటోలు ఎదురుగా ఇష్టమైన వ్యక్తి ఎదురుగా హార్ట్ సింబల్ పెట్టాలని.. అలానే ఇష్టంలేని వ్యక్తి ఎదురుగా డిస్ లైక్ సింబల్ పెట్టాలని ఆదేశించారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో కౌశల్‌పై తనీష్, గీతా, దీప్తి, సామ్రాట్‌లు డిస్ లైక్ బాణాలు వదిలారు. ఫైనల్‌లో మాతో పాటు కౌశల్‌ ఉండకూడదని తాము భావిస్తున్నామంటూ తమ ఫేవరేట్ కంటెస్టెంట్‌లకు హార్ట్ సింబల్స్ ఇచ్చారు.

తనీష్ ఈ టాస్క్‌లో భాగంగా.. తనతో పాటు సామ్రాట్ ఫైనల్‌ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. మొదటి నుండి సామ్రాట్ అంటే తనకు ఇష్టం అని అందుకే ఫైనల్‌లో తన పక్కన సామ్రాట్‌ని చూడాలనుకుంటున్నానన్నారు. ఇక కౌశల్‌ని ఫైనల్‌లో చూడాలనుకోవడం లేదంటూ డిస్ లైక్ ఇచ్చారు. దీప్తి నల్లమోతు మాట్లాడుతూ.. తనతో పాటు గీతా మాధురిని ఫైనల్‌లో చూడాలనుకుంటున్నానని.. అయితే నెగిటివ్ థింకింగ్‌తో ఎప్పుడూ తనని ఒంటరి చేస్తున్నాం అంటూ పదే పదే అంటున్న కౌశల్‌ని ఫైనల్‌లో చూడాలనుకోవడం లేదన్నారు. గీతా మాధురి తనతో పాటు దీప్తి నల్లమోతు ఫైనల్‌లో ఉండాలన్నారు. కౌశల్‌తో తాము ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన ఏకాకి అనే ఫీలింగ్‌లో ఉంటూ బయటకు రాలేకపోతున్నారని అందుకే ఆయన ఫైనల్‌లో ఉండాలని కోరుకోవడం లేదన్నారు. సామ్రాట్ మాట్లాడుతూ.. అందరూ ఊహించినట్టుగానే తనీష్ తనతో ఫైనల్‌లో ఉండాలన్నారు. ఇక నిన్న కౌశల్ చెప్పిన కథలో మేం వేటగాళ్లమే కాని.. మీపై బాణాలు వేసింది గుచ్చింది లేదన్నారు. ఇక్కడ ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. గ్రూప్‌లు ఉన్నాయని మీకు మీరు ఏదో ఊహించుకుంటున్నారన్నారు. ఈ కారణంతో కౌశల్‌ తనతో పాటు ఫైనల్‌లో ఉండాలని కోరుకోవడం లేదన్నారు. ఇక ఫైనల్‌గా కౌశల్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్‌లో నాతో పాటు గీతా మాధురి ఉండొచ్చన్నారు. తనకు ఉన్న పాపులారిటీ, ఫ్యాన్స్ వల్ల ఆమె ఫైనల్‌లో ఉండొచ్చన్నారు. ఇక గ్రాండ్ ఫినాలేకి వచ్చిన ఐదుగురిలో నలుగురు ప్రజల ఓటింగ్ ద్వారా వచ్చారని.. మిగిలిన సామ్రాట్ హౌస్ మేట్స్ హెల్ప్‌తో ఫినాలేకి వచ్చాడని.. నా దృష్టిలో ఉన్నవాళ్లలో అతనే వీక్ కంటెస్టెంట్ అని అందుకే అతన్ని ఫైనల్‌లో చూడాలనుకోవడం లేదన్నారు.

గత వారం విడుదలైన హిట్ కొట్టిన ‘నన్ను దోచుకుందువటే’ జంట.. సుధీర్ బాబు, కన్నడ భామ నభా నటేశ్ లు బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు. కంటెస్టెంట్ సినిమా ముచ్చట్లు చెప్తూ సరదా సరదా టాస్క్‌లలో ఆకట్టుకున్నారు.