HomeTelugu News'తీస్ మార్ ఖాన్' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘తీస్ మార్ ఖాన్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Aadi Sai Kumar Tees Maar Kh

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. కళ్యాణ్ జి గోగణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!