
Coolie Overseas Rights:
రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా మూవీ ‘కూలీ’ ఇప్పటికే భారీ అంచనాలు రేపుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా, ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్కి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ‘కూలీ’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ట్రేడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను పొందాలని పోటీ పడుతున్నారు. టాక్ ప్రకారం, ఓవర్సీస్ రైట్స్ దాదాపు రూ. 90 కోట్లకు అమ్ముడవుతున్నాయట. ఇది ఇప్పటివరకు కోలీవుడ్‌లో ఏ సినిమాకు లభించిన అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ అవుతుందన్న వార్తలే వినిపిస్తున్నాయి.
ఇంత భారీ రేటుకి ఓవర్సీస్ రైట్స్ అమ్ముడవుతుండటం వల్ల, ట్రేడ్ విశ్లేషకులు ఒకే మాట చెబుతున్నారు – పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ముఖ్యం. సినిమాలో ఒక చిన్న మిస్ అయినా, డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే, ప్రమోషన్స్ బాగుండాలి, ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ క్లోజ్ కావాలి.
ఇక, ఈ బజ్ నిజమైతే, సినిమా ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ అయ్యేనా? లేక డిస్ట్రిబ్యూటర్లకు నష్టమేనా అనేది చూడాలి. ‘కూలీ’ పక్కా మాస్ మసాలా కథతో రజనీ స్టైల్‌లో ఉండబోతోంది అనేది ఇప్పటికే తెలుస్తోంది. లోకేష్ మార్క్ స్క్రీన్ ప్లేకి రజనీ ఎనర్జీ తోడైతే కలెక్షన్ల విషయంలో సునామీ రావడం ఖాయం.
అధికారికంగా ఈ డీల్‌పై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ట్రేడ్ లో ఉన్న హైప్ చూస్తే, రజనీ సారు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.