HomeTelugu Trendingగోపీచంద్‌ ‘ఆరడుగుల బుల్లెట్‌' మూవీ ట్రైలర్‌

గోపీచంద్‌ ‘ఆరడుగుల బుల్లెట్‌’ మూవీ ట్రైలర్‌

Aaradugula Bullet Movie Tra

గోపీచంద్‌, నయనతార హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్ర ‘ఆరడుగుల బుల్లెట్‌’. ఈ సినిమా అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. యాక్షన్‌-కామెడీ జానర్‌లో సాగే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మణిశర్మ సంగీతం అందించిన చిత్రాన్ని, జయబాలాజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేశ్‌ నిర్మించారు.

నాలుగేళ్ల క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తొలుత 2017 జూన్‌9న విడుదల తేదీగా ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. నాలుగేళ్ల తరువాత 2021 జూన్9 విడుదల అంటూ అప్‌డేట్‌ ఇచ్చినప్పటికీ.. కరోనా సెకెండ్‌వేవ్‌ కారణంగా మరోసారి వాయిదా పడింది. పరిస్థితులు మళ్లీ కుదటపడటంతో ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతనెలలో విడుదలైన ‘సీటీమార్‌’తో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు గోపీచంద్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu