‘రాజుగారి గది’ లో ముచ్చటగా మూడో హీరోయిన్‌..?

ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌ నిర్మిస్తున్న ‘రాజుగారి గది’ సిరీస్ లో వస్తున్న మూడో సినిమాకు హీరోయిన్ దొరకడం లేదు. హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘రాజుగారి గది 3’ సినిమాకు మొదట తమన్నాను అనుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. స్క్రిప్ట్ లో మార్పుల కారణంగా తమన్నా ఆ సినిమా నుంచి తప్పుకుంది. తమన్నా తప్పుకోవడంతో కాజల్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. రెమ్యునరేషన్ నచ్చకపోవడంతో కాజల్ కూడా రాజుగారి గదిలోకి ఎంటర్ కాలేదు. మూడో సినిమాకోసం ముచ్చటగా మూడో హీరోయిన్ ను ట్రై చేస్తున్నారు. ఉయ్యాలా జంపాల సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న అవికా గౌర్ ను సంప్రదిస్తున్నారట. మరి అవికా అయినా రాజుగారి గది 3లోకి ప్రవేశిస్తుందా లేదా..? చూడాలి.