HomeTelugu Trendingసింగర్‌ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం

సింగర్‌ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం

 

Singer mangli met with carసింగర్‌ మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వాహనం వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీ సహా కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారి పై తొండుపల్లి వంతెన వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు శంషాబాద్ పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో నిర్వహించిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ పూర్తి చేసుకొని అర్ధరాత్రి సమయంలో మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో ఇంటికి బయల్దేరారు. ఆ టైమ్‌ మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్‌ బయలుదేరింది. బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా వెళ్తోన్న సమయంలో శంషాబాద్‌ మండలం తొండుపల్లి బ్రిడ్జి వద్ద మంగ్లీ కారుకు ప్రమాదం జరిగింది.

మంగ్లీ ప్రయాణిస్తోన్న కారును ఓ డీసీఎం వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెతో పాటు కారులో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ఆ తర్వాత స్థానికుల సహాయంతో క్షతగాత్రులు నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మంగ్లీ కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ప్రమాదం జరిగిన సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నట్లు ప్రాథమిక విచారణ తెలిందని సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu