HomeTelugu Trending'మా' అధ్యక్ష బరిలో మరో సీనియర్‌ నటుడు

‘మా’ అధ్యక్ష బరిలో మరో సీనియర్‌ నటుడు

Actor cvl narasimha rao in
‘మా'( మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం నలుగురు సభ్యులు ప్రకాశ్‌రాజ్‌, నటుడు మంచు విష్ణు, నటీమణులు జీవిత, హేమలు పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో నటుడి పేరు వచ్చి చేరింది. తెలుగు చిత్రపరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు సీవీఎల్‌ నరసింహారావు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆదివారం వెల్లడించారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను అన్నివిధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu