HomeTelugu Trendingత్వరలో ఓఇంటివాడు కానున్న యంగ్‌హీరో

త్వరలో ఓఇంటివాడు కానున్న యంగ్‌హీరో

Actor naga anvesh got engag

టాలీవుడ్‌లో .. ఇంట్లో ఇల్లాలు వట్టింట్లో ప్రియురాలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన నాగ అన్వేష్ ఏంజిల్ , వినవయ్యా రామయ్యా చిత్రాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలు కుర్ర హీరోకు ఆశించిన ఫలితాలను అందించలేకపోయినా మంచి గుర్తింపుని తీసుకొచ్చిపెట్టాయి. ఈ సినిమాల తరువాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న నాగ అన్వేష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం నాగ అన్వేష్ ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

కావ్య అనే తన స్నేహితురాలిని అన్వేష్ ప్రేమించి.. ఇంట్లో వారిని ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఇక కావ్య తండ్రి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కంపెనీ డైరెక్టర్ విజయ్ కుమార్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. మరి పెళ్లి తరువాత అన్వేష్ సినిమాల్లో నటిస్తాడా.. మామగారి కంపెనీలను చూసుకుంటాడా..? చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu