మీ కోస‌మే నా అందాలంటూ హాట్ కామెంట్స్ చేసిన జాన్వీ క‌పూర్

శ్రీ‌దేవి ఉన్న‌పుడు చాలా అరుదుగా బ‌య‌ట క‌నిపించేది జాన్వీ క‌పూర్. అమ్మ చాటు కూతురుగానే ఎక్కువ‌గా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రోజురోజుకీ తన ఇమేజ్‌ను పెంచుకుంటుంది జాన్వీ క‌పూర్. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. తాజాగా జిమ్‌కు వ‌చ్చిన జాన్వీ క‌పూర్.. అక్క‌డ హాట్ కామెంట్స్ చేసింది. ఆ మ‌ధ్య వోగ్ బ్యూటీ అవార్డ్స్‌లో ఓ రెచ్చిపోయింది జాన్వీ క‌పూర్. ఇక ఇప్పుడు జిమ్ క్యాస్ట్యూమ్‌లో కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు అందాలు ఆర‌బోసే ప‌నిలో బిజీ అయిపోయింది జాన్వీ క‌పూర్.

న‌ట‌న విష‌యంలో ఇప్పుడు ఎవ‌రూ ఈ భామ‌ను అడ‌గ‌రు.. అందుకే అభిన‌యం ప‌క్క‌న‌బెట్టి అందంపై దృష్టి పెట్టింది. ధ‌డ‌క్ త‌ర్వాత వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది జాన్వీ క‌పూర్. ఇప్ప‌టికే క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్‌లోనే మ‌రో రెండు సినిమాలు సైన్ చేసింది ఈ బ్యూటీ. తాజాగా జిమ్ డ్ర‌స్‌లో ర‌చ్చ చేసిన జాన్వీ అక్క‌డ ఫోటోగ్రాఫ‌ర్స్‌కు కూడా అదిరిపోయే స‌మాధానాలు చెప్పింది

జిమ్‌కు వెళ్తున్నానని కాదు. ఎక్కడికి వెళ్తున్నా మీరు ఫోటోలు తీస్తున్నారు. కాబట్టి మీ కోసమే ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను అంటూ హాట్ కామెంట్స్ చేసింది జాన్వీ క‌పూర్. మొత్తానికి ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు అందాలు ఆర‌బోస్తూ.. మ‌రొక్క హిట్ కానీ కొట్టిందంటే శ్రీ‌దేవి కోరుకున్న‌ట్లు జూనియ‌ర్ శ్రీ‌దేవి చ‌క్రం తిప్ప‌డం ఖాయం.