HomeTelugu Trendingనందు చెప్పిన బీబీ ఇదే

నందు చెప్పిన బీబీ ఇదే

Actor Nandu BB is Bomma Blo

గీతామాధురి భర్త, సినీ నటుడు నందు తాను ‘బిబి’లో రచ్చ చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది నందు బిగ్‌బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడని అనుకున్నారు. కానీ కాస్త ఆలోచించిన వారు ఎవరైనా కూడా బిగ్‌బాస్ లోకి వెళ్లే వారు ఎవరూ అలా ప్రకటించరు. కనుక నందు మరేదో ప్రకటన చేయబోతున్నట్లు అనుకున్నారు. అసలు విషయం ఏమిటనేది నందు క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం బిగ్‌బాస్ ట్రెండ్‌ నడుస్తుంది కనుక బిబి అంటే మంచి పబ్లిసిటీ దక్కుతుందనే ఉద్దేశ్యంతో ఆ విధంగా చేశాడు నందు. బిబి అంటే ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ నందు తాపీగా చెప్పేసి తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని సంపాదించాడు. మామూలుగా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ గురించి ఇంతగా పబ్లిసిటీ వచ్చి ఉండేది కాదు. ఈ సమయంలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ను తీసుకుని తన సినిమాకు పబ్లిసిటీ చేసుకోవడంలో నందు సఫలం అయ్యాడని చెప్పుకోవచ్చు. నందు హీరోగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Actor Nandu (@that_actor_nandu) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu