HomeTelugu Trendingఎన్టీఆర్ మూవీలో అన్షు!

ఎన్టీఆర్ మూవీలో అన్షు!

Anshu

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘‘అయిననూ పోయిరావలె హస్తినకు’’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులోఅన్షును హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాగార్జున మన్మథుడు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అన్షు ఆ తర్వాత ప్రభాస్‌తో కలిసి రాఘవేంద్ర మూవీలోనటించింది. నేచురల్ అందంతో పాటు నటనతో ఆకట్టుకునే అన్షుని దర్శకుడు త్రివిక్రమ్ మరోసారి తెరపైకి తీసుకున్నట్టు సమాచారం. చాలా గ్యాప్ తర్వాత అన్షు ఈ సినిమాలోకనిపించబోతుందట. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్-రానా మూవీకి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తున్నాడు. ఈ రెండు సినిమాల అనంతరం ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu