HomeTelugu Trendingనితిన్‌ 'మాస్ట్రో' ఫస్ట్‌లుక్‌

నితిన్‌ ‘మాస్ట్రో’ ఫస్ట్‌లుక్‌

Netin Maestro First Look 1
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ హీరోగా మెర్లపాక గాంధీ డైరెక్షణ్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నితిన్‌ ఈసినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ఈ రోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్.. టైటిల్ పోస్టర్ ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్ లో నితిన్ లుక్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. జీన్స్ దానిపై సూట్ ధరించి చేతిలో వాకింగ్ స్టిక్ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఆ కళ్లకు నల్లద్దాలు ధరించిన తీరు చూస్తుంటే ఈ సినిమాలో నితిన్‌ అంధుడు పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది నితిన్ 30వ చిత్రం.

ఈ చిత్రంలో తమన్నా భాటియా కీలక పాత్రలో నటిస్తుంది. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. జూన్ 11 న మాస్ట్రోను విడుదల చేస్తామని మేకర్స్ మరోసారి ప్రకటించారు. 2021 లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా బరిలో దిగుతున్న ‘మాస్ట్రో’ బాలీవుడ్ బ్లాక్ అంధాధున్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నరేష్, జిషుసేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య హర్షవర్ధన్, రాచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu