HomeTelugu Newsబిగ్‌బాస్‌లో వైల్డ్‌ కార్డు ఎంట్రీ.. ఎవరో తెలుసా!

బిగ్‌బాస్‌లో వైల్డ్‌ కార్డు ఎంట్రీ.. ఎవరో తెలుసా!

13 8తెలుగు ‘బిగ్‌బాస్’ సీజన్ 3 అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న ఈ షో తాజాగా నాల్గు వారాలు కంప్లీట్ చేసుకొని..తాజాగా ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా హౌస్‌ నుండి ఒకరు ఎలిమినేట్ అవనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌ నుంచి అషు రెడ్డి వెళ్లి పోవడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మూడో వారంలోనే తమన్నా సింహాద్రిని హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇప్పటికే ఈ షోకి మంచి ఆదరణ ఉండటంతో ఈ షోకు మరింత గ్లామర్ అద్దాలనే ప్రయత్నంలో బిగ్ ‌బాస్ షో నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం. ఇక ఐదో వారంలో ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ప్లేస్‌లో ఈషా రెబ్బా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

13a

Recent Articles English

Gallery

Recent Articles Telugu