హీరో కోసం దిల్ రాజు వెతుకులాట!

తన బ్యానర్ లో వరుస విజయాలను అందుకుంటున్న నిర్మాత దిల్ రాజు.. ప్రస్తుతం లవర్, భారతీయుడు2 వంటి సినిమాలకు తన బ్యానర్ లో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో హీరో కోసం దిల్ రాజు వెతుకులాట మొదలుపెట్టాడని తెలుస్తోంది. సతీష్ వెగ్నేస ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ ముందుగా ఎన్టీఆర్ తో చేయాలని భావించాడు.

దానికోసం ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశాడు. ఎన్టీఆర్ ను కలిసి కథ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదు. త్రివిక్రమ్ సినిమా మొదలవ్వడానికి సమయం పడితే దిల్ రాజు సినిమా చేయాలనుకున్నాడు ఎన్టీఆర్. 

కానీ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్.. దిల్ రాజుతో సినిమా ఆలోచన పక్కన పెట్టేశాడు. దిల్ రాజు ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయాలనుకుంటున్నాడు. దీంతో ఇప్పుడు హీరోగా ఎవరిని తీసుకోవాలా..? అనే ఆలోచనలో పడ్డాడు.