HomeTelugu Trendingఈ విషయంలో చిరంజీవిగారు దేవుడు

ఈ విషయంలో చిరంజీవిగారు దేవుడు

5 19నటి హేమ రక్త దానం చేయడం చాలా గొప్ప కార్యం అన్నారు. ఇటీవల ఆమె తన కూతురుతో కలిసి చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ లో రక్త దానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘గతంలో నేను గర్భిణిగా ఉన్న సమయంలో నాకు తీవ్ర రక్తస్రావం జరిగింది. రక్తం అవసరమైంది. నాది అరుదైన బ్లడ్ గ్రూప్ కావడంతో ఎక్కడా దొరకలేదు. దాంతో నటుడు రాజా రవీంద్రకు ఫోన్ చేసి విషయం చెప్పగానే తాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తీసుకు వచ్చారని చెప్పారు. ఆ సమయంలో రక్తం విలువ తెలిసిందని’ అన్నారు. ఆ సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆదుకోకుంటే నాకు చాలా ప్రమాదం జరిగేది. ఈ విషయంలో చిరంజీవిగారు నిజంగా దేవుడే. అంటూ మెగాస్టార్ ను కొనియాడారు నటి హేమ

Recent Articles English

Gallery

Recent Articles Telugu