HomeTelugu Big Storiesకరోనాపై నటి మాధవీ లత టిక్‌టాక్‌.. వీడియో వైరల్‌

కరోనాపై నటి మాధవీ లత టిక్‌టాక్‌.. వీడియో వైరల్‌

6 6
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో నటి మాధవీ లత కరోనా వైరస్‌ను ఉద్దేశించి ఆమె టిక్‌టాక్‌ వీడియో చేశారు. రాజు, పేద తేడా ఈ వైరస్‌కు తెలియదు. జీవితంలో ఎన్ని సాధించినా చివరికి మనతో ఏదీ రాదనే సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

‘మొదటి అంకె నేను అని, మొదటి స్థానం నాది అని, మొదటి నుంచి విర్రవీగే మొదటి రకం పొగరుబోతా.. భూమిపై స్థానం అంటే ప్రాణమని తెలుసుకో.. ఇంట్లో ఉండండి.. జాగ్రత్తగా ఉండండి’ అని ఆమె చెప్పిన స్టైల్‌ నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను 4.4 లక్షల మందికిపైగా వీక్షించారు. 35 వేల మంది లైక్‌ చేశారు. ‘ఒక్క నిమిషంలో జీవితం అంటే ఏంటో తెలియజేశారు, చాలా బాగా చెప్పారు, మీ కవిత చాలా బాగుంది..’ అని పలువురు కామెంట్ల రూపంలో ప్రశంసిస్తున్నారు.

 

https://www.tiktok.com/@actressmaadhavi/video/6811835122577378561

Recent Articles English

Gallery

Recent Articles Telugu