అమలాపాల్ మాజీ భర్తతో సాయి పల్లవి పెళ్లి.. ఫ్యాన్స్ ఫైర్

‘ప్రేమమ్‌’ సినిమా తో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన మల్లార్‌ బ్యూటీ సాయి పల్లవి.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి లాంటి చిత్రాలతో ఆకట్టుకుని తెలుగుతో పాటు మలయాళం తమిళ భాషల్లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘మారి 2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్‌తో సోషల్ మీడియాలను షేక్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ రౌడీ బేబీ గురించే చర్చ నడుస్తున్న సందర్భంలో ఆమె ఫ్యాన్స్ బిత్తరపోయే మరో వార్త హల్ చల్ చేస్తుంది. అదే ఏ ఎల్ విజయ్‌తో సాయి పల్లవి పెళ్లంట.

అమలాపాల్‌తో ప్రేమలో మునిగితేలి ఆ తర్వాత కొన్నేళ్లు పాటు డేటింగ్ చేసిన అనంతరం పెళ్లి చేసుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్‌తో రెండో పెళ్లికి రెడీ అయ్యిందట సాయి పల్లవి. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ వార్త తమిళ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో సాయి పల్లవి ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి గాలి వార్తల్ని నమ్మొద్దని.. ఈ వార్తల్ని ఖండిస్తున్నారు. అయినా సాయి పల్లవి అమలాపాల్ మాజీ భర్తను ఎందుకు చేసుకుంటుంది కొంచెమైన సిగ్గుండాలి అంటూ ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సాయి పల్లవి నటించిన ‘కణం’ చిత్రానికి దర్శకత్వం వహిచారు ఏ ఎల్ విజయ్. అప్పటి నుండి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. సాయి పల్లవి పెళ్లిపై ఎప్పటి నుండో గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్స్‌కి చెక్ పెడతూ ఇటీవలే సాయి పల్లవి.. జీవితంలో అసలు పెళ్లే చేసుకోనంటూ బాంబ్ పేల్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆమె పెళ్లి గురించి వార్తలు రావడంతో అదికూడా వివాదాస్పద దర్శకుడిగా ఉన్న ఏ ఎల్ విజయ్‌తో పెళ్లి అంటూ పుకార్లు షికారు చేస్తుండటంతో సాయి పల్లవి ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.