HomeTelugu Trendingసిమ్రాన్‌ షాకింగ్‌ లుక్‌

సిమ్రాన్‌ షాకింగ్‌ లుక్‌

7 13టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది సిమ్రాన్. తెలుగులో స్టార్‌ హీరోలందరితోనూ ఆమె నటించింది. ఈ క్రమంలో ఆమె నటించిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కేవలం తెలుగులోనే కాక పలు దక్షిణాది చిత్రాల్లోనూ సిమ్రాన్ నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఒకప్పుడు ఆమె ఎంత గ్లామరస్‌గా ఉండేదో.. ఇప్పుడుకు అందుకు పూర్తి భిన్నంగా కనిపించి అభిమానులందరికీ షాక్ ఇచ్చింది. తన లేటెస్ట్ ఫొటోను సిమ్రాన్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫొటోలో సిమ్రాన్‌ను చూసిన వారు అవాక్కవుతున్నారు. ఒకప్పుడు గ్లామర్‌కి కేరాఫ్‌గా నిలిచిన సిమ్రాన్ ఇప్పుడు ఇలా మారిందేమిటబ్బా అని సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2003లో సిమ్రాన్ వివాహం అయినా ఆమె పలు తెలుగు చిత్రాల్లో నటించింది. ఇక ఆమె ఇప్పుడు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. గత కొంత కాలం క్రితమే ఆమె నటుడు రజినీకాంత్‌ కలిసి పెట్ట సినిమాలో నటించింది. ప్ర‌స్తుతం రాకెట్రీ, షుగర్ అనే మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది సిమ్రాన్‌.

View this post on Instagram

Auto ride ❤️❤️❤️❤️

A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu