HomeTelugu Trendingడీవీవీ దానయ్య తనయుడు ఫస్ట్‌ మూవీ టైటిల్‌.. గ్లింప్స్‌ విడుదల

డీవీవీ దానయ్య తనయుడు ఫస్ట్‌ మూవీ టైటిల్‌.. గ్లింప్స్‌ విడుదల

ADHIRA First Strike
టాలీవుడ్ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జా తో కలిసి ‘హనుమాన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 100 రోజుల్లో ఈ షూటింగ్ పూర్తిచేసిన ఈ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ బిగ్ అనౌన్సమెంట్ ను ఏకంగా ఆర్ఆర్ఆర్ టీమ్‌ రాజమౌళి, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో లాంచ్ చేయించడం విశేషం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు దాసరి కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ తీసుకున్నాడు. ‘అధీరా’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా టైటిల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

సూపర్ హీరో గా కళ్యాణ్ ను చూపిస్తూ కట్ చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. అధీరా అంటూ వెనుక నుంచి వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందనే చెప్పాలి. మొత్తానికి టైటిల్ తోనే సగం ఆసక్తిని పెంచిన డైరెక్టర్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ డిజైన్ తో ఈ సినిమా భారీ అంచనాలు రేకెత్తించాడు ప్రశాంత్ వర్మ. టాలీవుడ్ లోనే మొట్టమొదటి జాంబీ మూవీ ని డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మనే .. ఇక హనుమాన్ తో మొట్టమొదటి సూపర్ హీరో సినిమాను తీస్తున్నాడు. ఇక ఇప్పుడేమో మరో అద్భుతమైన సినిమాతో రాబోతున్నాడు.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పాల్గొన్న ‘ఆర్‌ఆర్ఆర్’ టీమ్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!