HomeTelugu Trendingనిఖిల్‌ వ్యాఖ్యలపై వర్మ కౌంటర్

నిఖిల్‌ వ్యాఖ్యలపై వర్మ కౌంటర్

Ramgopal Varma counter on N

వివాదాల దర్శకుడు ఆర్జీవీ ‘పవర్ స్టార్ సినిమా’ టీజర్‌ను నిన్న విడుదల చేయడంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. అసలు ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచీ ఏదో ఒక వివాదం రేపుతున్నాడు వర్మ. పవర్ స్టార్ టీజర్ పై అయితే పవన్ ఫ్యాన్స్ మరింత రచ్చ చేస్తున్నారు. పవర్ స్టార్ అభిమానులు ఎంత రెచ్చిపోతే అంత ప్రమోషన్స్ అన్నట్లుగా వర్మ రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రామ్‌గోపాల్ వర్మపై యంగ్ హీరో నిఖిల్ పరోక్షంగా కామెంట్ చేశాడు. నిఖిల్ కామెంట్లకు అభిమానులు సైతం మద్దతిస్తున్నారు.

సాధారణంగా ఏమీ అనని వాళ్లపైనే ఊహించని విధంగా సెటైర్లు వేసే వర్మ.. తనపై కామెంట్స్ చేసిన వారిపై ఎలా స్పందిస్తాడో తెలిసిందే. ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా ఆ మహా శిఖరం తల తిప్పి కూడా చూడదు. మీకు అర్థం అయ్యిందిగా` అంటూ హీరో నిఖిల్ వ్యాఖ్యలపై వర్మ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు. నిఖిల్ ఎవరో నాకు తెలియదు. వీళ్లంతా ఒకే కోవకు చెందిన వారు. వీళ్లంతా పవన్‌కు తొత్తులుగా ఉండేవాళ్లు. అలా ఉంటే పవన్‌కు వీళ్లపై మంచి అభిప్రాయం ఉంటుందని ఆశ. నిఖిల్ పెద్ద స్టార్ అయి ఉండొచ్చు.. కానీ నాకు తెలియదు.. నేనెప్పుడూ అతని సినిమాలు చూడలేదు. నన్ను చాలా మంది ఎప్పటి నుంచో తిడుతున్నారు. నాలాగే ఇతరులకూ తన భావాన్ని వెల్లడించే హక్కు ఉంటుంది కదా.. అందుకే నాపై వచ్చే విమర్శలను పట్టించుకోను అంటున్నాడు వర్మ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu