HomeTelugu Newsప్ర‌యోగాత్మ‌కంగా ఆదిత్య ఓమ్ 'బందీ'.. ఫస్ట్‌లుక్‌

ప్ర‌యోగాత్మ‌కంగా ఆదిత్య ఓమ్ ‘బందీ’.. ఫస్ట్‌లుక్‌

Aditya om bandhi first lo

టాలీవుడ్‌లో “లాహిరి లాహిరి లాహిరిలో” సినిమాతో తెరంగ్రేటం చేసిన హీరో ఆదిత్య ఓమ్‌. విజ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం”బందీ”. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ ఈ రోజు (సోమ‌వారం) విడుద‌లైంది. ఇందులో హీరో అడ‌విలో ‘బందీ ‘అయిన‌ట్లు క‌నిపిస్తోంది. అత‌ని ఛాతీపై తొండ పాకుతుండ‌గా ప‌క్క‌నే విషస‌ర్పం బుస‌లు కొడుతోంది. దీన్ని చూసిన అభిమానులు ఒళ్లు జ‌ల‌ద‌రిస్తోంద‌ని, ఇలాంటి పాత్ర చేసేందుకు నటించడం అంటే మామూలు విష‌యం కాద‌ని నెటిజన్లు ప్ర‌శంసిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ మొత్తం దాదాపుగా అడ‌విలోనే జ‌రుగుతుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. ఈ సందర్భంగా ఆదిత్య ఓం మాట్లాడుతూ సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్రతో ఉంటుంది. ఇలాంటి ప్రయోగాత్మక సినిమా తెలుగులో రావటం ఫస్ట్ టైమ్ అనుకుంటున్నాను. ఆ అవకాశం నాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. టీ రాఘ‌వ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ‘బందీ’ సినిమాను రాకేశ్ గోవ‌ర్ధ‌న‌గిరి, మధు సూద‌న్ కోట నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ‌తేడాదే విడుద‌ల కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యమ‌వుతూ వ‌చ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!