HomeTelugu Trendingఅశ్విన్‌బాబు న్యూమూవీ టైటిల్‌ 'హిడింబ'

అశ్విన్‌బాబు న్యూమూవీ టైటిల్‌ ‘హిడింబ’

Ahwin babu new movie title

యాంకర్‌ ఓంకార్‌ తమ్ముడు హీరో అశ్విన్‌ బాబు.. జీనియస్‌, రాజుగారి గది 2, రాజుగారి గది 3 తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయ్యాడు. ప్రస్తుతం ఆయన అనిల్‌ కృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. నేడు అశ్విన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌, అశ్విన్‌ ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘హిడింబ’ అనే విభిన్న టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.

నుదుటిపై నెత్తుటి మరకలతో సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నాడు అశ్విన్‌. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్నట్టు అనిపిస్తుంది. నందితా శ్వేత హీరోయిన్‌గా నటిస్తోంది. రఘుకుంచె, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ విఘ్నేశ్‌ కార్తీక్‌ సినిమాస్‌ పతాకంపై గంగాపట్నం శ్రీధర్‌ నిర్మిస్తోస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu