HomeTelugu Trendingమాచర్ల నియోజకవర్గం: మేకింగ్‌ వీడియో విడుదల

మాచర్ల నియోజకవర్గం: మేకింగ్‌ వీడియో విడుదల

Macherla Niyojakavargam Mak

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతీ శెట్టి, కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్‌లుగా నటించనున్నారు. పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ మూవీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించన అప్పటినుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌, సాంగ్స్‌, ట్రైలర్‌ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది మూవీ యూనిట్‌. పలు యాక్షన్‌ సన్నివేశాలు, సాంగ్స్‌ షూటింగ్స్‌ను ఈ వీడియోలో చూడొచ్చు. పోరాట సన్నివేశాలను తెరకెక్కించేందుకు ఎంత కష్టపడతారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే డ్యాన్స్ విషయంలో తీసుకునే శ్రద్ధ కనిపిస్తుంది. షూటింగ్‌లో బ్రేక్‌ సమయంలో నితిన్‌, కృతిశెట్టి కబుర్లు చెప్పుకుని నవ్వుకోవడం సరదాగా ఉంది. కాగా పొలిటికల్‌ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. రాజేంద్ర ప్రసాద్, సముద్ర ఖని, శుభలేక సుధాకర్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu