HomeTelugu Big Storiesఅజిత్ 'వాలిమై' ఫస్ట్‌లుక్ విడుదల

అజిత్ ‘వాలిమై’ ఫస్ట్‌లుక్ విడుదల

Ajit Valimai first look

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వాలిమై. ఈ చిత్రం అప్‌డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ దీనికి సంబంధించి అప్‌డేట్ ఇవ్వాలంటూ ఏడాదిగా సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏ కార్యక్రమం జరిగినా అక్కడ అభిమానులు నినాదాలు చేయడంతో అజిత్ స్పందించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ‘వాలిమై’ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో అజిత్ సీఐడీ అధికారిగా కనిపించనున్నారు. అజిత్‌ సరసన హ్యూమా ఖురేషి నటిస్తోంది. ఇందులో తెలుగు నటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. బేవ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu