HomeTelugu Trendingలొకేష‌న్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ.. వీడియో రిలీజ్‌

లొకేష‌న్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ.. వీడియో రిలీజ్‌

Pawan kalyan movie shoot be
పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ల‌యాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12గా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తున్నారు. జ‌న‌వ‌రి 25 నుండి చిత్ర షూటింగ్ మొద‌లు కాగా, ఈ రోజు రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఓ వీడియో చేశారు. ఈ వీడియోలో ప‌వ‌న్ లొకేష‌న్‌లో అడుగుపెట్ట‌డం, చిత్ర ద‌ర్శ‌కుడు, త్రివిక్ర‌మ్‌తో మంత‌నాలు చేయ‌డం ఫైన‌ల్‌గా బుల్లెట్‌పై ర‌య్యిమంటూ వెళ్ల‌డం వంటి స‌న్నివేశాలు చూపించారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో పది రోజులపాటు యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరగనుందని మేకర్స్ తెలిపారు. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్‌తో పాటు రానా, సాయి ప‌ల్ల‌వి, ఐశ్వ‌ర్య రాజేష్ కూడా జాయిన్ కానున్న‌ట్టు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu