HomeTelugu Newsఅఖిల్‌ కొత్త సినిమా మొదలుపెట్టాడు!

అఖిల్‌ కొత్త సినిమా మొదలుపెట్టాడు!

15 5అక్కినేని అఖిల్ హీరోగా మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్న అఖిల్ కు బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. గీతా 2 బ్యానర్లో సినిమా తెరకెక్కుతోంది.

ఇందులో హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హీరోయిన్ ఎవరు అనే దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఫైనల్ గా మాత్రం ఎవరు అన్నది ఇప్పటి వరకు తెలియలేదు. సినిమా టైటిల్ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నది. ఈ రెండు పెండింగ్ లో ఉండగానే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచే సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇందులో హీరోయిన్, టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu