HomeTelugu Trendingకెరీర్‌ సూపర్‌.. మ్యారీడ్ లైఫే అంటున్న అఖిల్

కెరీర్‌ సూపర్‌.. మ్యారీడ్ లైఫే అంటున్న అఖిల్

Most Eligible Bachelor Pr
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’. ఈ సినిమా ప్రీ టీజర్‌ను విడుదల చేశారు. ‘అబ్బాయి లైఫ్ లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్ ఉంటుంది’ అంటూ అఖిల్ చెప్పిన డైలాగు ఆకట్టుకుంటుంది. ‘కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా, ఇక మ్యారీడ్ లైఫే… అయ్యయ్యయ్యయ్యో..’ అని చెబుతూ ఊగిపోయాడు.

పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 25న ఉదయం 11.40 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాని 2021 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తరుణ్ భాస్కర్‌తో క్లాప్‌బోర్డు ఇంటర్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu