HomeTelugu Trendingఅఖిల్‌ న్యూలుక్‌ వైరల్‌

అఖిల్‌ న్యూలుక్‌ వైరల్‌

Akhil akkineni posts his bu

టాలీవుడ్‌ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా కోసం అఖిల్ షాకింగ్ ట్రాన్సఫార్మేషన్ లోకి మారిన విషయం తెలిసిందే. ఏజెంట్ షూటింగ్‌ను ప్రారంభించే ముందు తన లుక్స్ కోసం జిమ్ లో నెలల తరబడి కష్టపడ్డాడు. ఈ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ గూఢచారిగా నటిస్తున్నాడు. దానికి తగినట్లుగానే ఉన్న అఖిల్ కొత్త మేకోవర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అఖిల్ ఇటీవలి లుక్‌లో తన బీస్ట్ లుక్ తో అందరినీ ఆకర్షించాడు. పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డంతో తన కండరపుష్టిని పిక్ లో చూపించాడు.

తాజాగా మరోసారి అఖిల్‌ తన న్యూలుక్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. బలమైన కండలను ప్రదర్శిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం అఖిల్ కు సంబంధించిన ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇక రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అఖిల్ కెరీర్‌లో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ‘ఏజెంట్‌’ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu