HomeTelugu Trendingఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: వీడియో సాంగ్‌ విడుదల

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: వీడియో సాంగ్‌ విడుదల

Kottha Kottha Gaa Video Son

సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్ – బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కొంతకాలం క్రితమే విడుదలకి ముస్తాబైంది. కాకపోతే సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. ట్యూన్ .. సాహిత్యం రెండూ కూడా మనసుకు పట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట ఈ ఆల్బమ్ కి హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 16వ తేదీన విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu