HomeTelugu Trendingకొరటాలతో అఖిల్‌!

కొరటాలతో అఖిల్‌!

Akhil movie with koratala
అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు 4 చిత్రాల్లో నటించాడు. అయిన ఈ యంగ్ హీరోకు ఒక్క హిట్ కూడా రాలేదు. ఇక తాజాగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న అఖిల్ తాజాగా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. అఖిల్ త్వరలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో జీఏ2 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. ‘ఇందులో అఖిల్ డాషింగ్ లుక్ బాగా ఆకట్టుకుంది.

తాజా సమాచారం ప్రకారం అఖిల్‌ తన ఆరోవ చిత్రం కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో కలిసి పని చేయనున్నారని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున కొరటాలతో చర్చించారని… ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే కొరటాల ‘ఆచార్య’, ఎన్టీఆర్ మూవీ పూర్తి చేసి ఆ తరువాత అఖిల్ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu