HomeTelugu Trendingశ్రీను వైట్లతో అఖిల్‌ మూవీ!

శ్రీను వైట్లతో అఖిల్‌ మూవీ!

Akhil movie with srinu vait

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్‌ నటించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక వచ్చేనెల నుంచి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. జులై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అఖిల్‌ మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి.

శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. శ్రీను వైట్ల చెప్పిన కథ మైత్రీవారికి నచ్చిందని అంటున్నారు. ఇక అఖిల్ కి కథను వినిపించవలసి ఉందని చెబుతున్నారు. స్టోరీ నచ్చితే వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. మైత్రీవారు ఆల్రెడీ అఖిల్ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారనీ .. ఈ ప్రాజెక్టు ఆయన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. శ్రీనువైట్ల గతంలో అక్కినేని నాగార్జున తో ‘కింగ్’ వంటి సూపర్ హిట్ అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu