HomeTelugu Trending‘విజయ రాఘవన్‌’ ట్రైలర్‌

‘విజయ రాఘవన్‌’ ట్రైలర్‌

Vijaya Raghavan Trailer
టాలీవుడ్‌లో బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన వంటి పలు ఆస్తికర చిత్రాల్లో నటించిన హీరో విజయ్‌ ఆంటోని. ‘మెట్రో’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తాజాగా విజయ్ ఆంటోని హీరోగా ‘విజయ రాఘవన్‌’ చిత్రం రూపొందించారు. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి. డి. రాజా, డి. ఆర్‌. సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను సోమవారం రానా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

ఈ సినిమా గురించి విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ‘ఓ మాస్ ఏరియాలో పిల్ల‌లు ప‌క్క దారులు ప‌ట్ట‌కుండా… చ‌దువు గొప్ప‌త‌నాన్ని వారికి వివ‌రించి, వారి ఉన్న‌తికి పాటు ప‌డే యువ‌కుడి క‌థే ‘విజ‌య రాఘ‌వ‌న్‌’. ప్ర‌స్తుత ట్రెండ్‌కు అనుగుణంగా దీనిని డైరెక్టర్‌ ఆనంద్ కృష్ణన్ తెరకెక్కించారు. నాది సరికొత్త పాత్ర. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ఈ సినిమా ఉంటుంది” అని అన్నారు. ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu