ఆర్‌ఆర్‌ఆర్‌లో హాట్‌ బ్యూటీ..!

ధర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో అనేకమంది స్టార్స్‌ నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రతి చిన్న పాత్రకు కూడా అందరికి తెలిసిన వ్యక్తులనే తీసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు టాలీవుడ్ హాట్ బ్యూటీ హంస నందిని కూడా చేరిపోయింది.

హంస నందిని ఓ పాత్ర కోసం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, ఆ పాత్ర ఏంటీ.. ఎలా ఉండబోతుంది అనే సంగతులు తెలియాల్సి ఉన్నది. కేవలం పాత్ర కోసమే తీసుకుంటున్నారా లేదంటే ఏదైనా సాంగ్ కోసం కూడా తీసుకుంటున్నారా అన్నది తెలియాలి. గతంలో ఈగ సినిమాలో హంస నందిని ఓ చిన్న కారెక్టర్‌ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా విడుదల కాబోతున్నది.