HomeTelugu Trendingతమిళ దర్శకుడితో అఖిల్‌ ఐదోవ సినిమా!

తమిళ దర్శకుడితో అఖిల్‌ ఐదోవ సినిమా!

5 17అక్కినేని అఖిల్ నుంచి వచ్చిన మూడు సినిమాలు అభిమానులను సంతృప్తి పరచలేకపోయాయి. ప్రస్తుతం ఆయన 4వ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు.

ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే తదుపరి ప్రాజెక్టును అఖిల్ లైన్లో పెట్టేశాడని అంటున్నారు. తమిళ దర్శకుల్లో పీఎస్ మిత్రన్ స్థానం ప్రత్యేకం. ఇటీవల ఆయన అఖిల్ ను కలిసి ఒక కథ చెప్పాడట. ఆ కథ బాగా నచ్చేయడంతో, వెంటనే అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu