చైతు, సమంతల ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!

అక్కినేని నాగచైతన్య, సమంతల ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే.. నాగార్జున కూడా వీరి వివాహానికి అంగీకరించడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుష్ లో ఉన్నారు. చైతు కంటే ముందుగా అఖిల్ నిశ్చితార్ధం జరగడంతో చైతు ఎంగేజ్మెంట్ ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం వీరి నిశ్చితార్ధానికి డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

జనవరి 29న ముహూర్థాన్ని ఖరారు చేశారు. అంతేకాదు తమ్ముడి పెళ్లి లానే చైతు పెళ్లి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతిలో జరగనున్నట్లు సమాచారం.