HomeTelugu TrendingSamantha: సినిమాలు లేకపోయిన తగ్గని క్రేజ్‌.. ఇండియాలోనే టాప్-1!

Samantha: సినిమాలు లేకపోయిన తగ్గని క్రేజ్‌.. ఇండియాలోనే టాప్-1!

Samantha

Samantha: టాలీవుడ్‌లో సమంత ‘ఏ మాయ చేశావే’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ.. వరుస సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఆమె ఖాతాలో పలు హిట్‌లను వేసుకుంది. గతేడాది ‘ఖుషి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో హిట్ అందుకుంది. ఆ వెంటనే ఆమె సినిమాలకు బ్రేక్‌ ప్రకటించింది.

అప్పట్నుంచి సమంత సినిమాలకు దూరంగా ఉంది. వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటుంది. అన్నీ టెన్షన్స్, బాధలను వదిలేసి రిలాక్స్ గా గడుపుతుంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది సమంత.అప్పుడప్పుడు ప్రైవేట్‌ ఈవెంట్లలో మెరుస్తుంది సమంత

గత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ఇప్పుడు ఇండియాలోనే టాప్‌గా నిలవడం విశేషం. కానీ ఇతర హీరోయిన్లు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్‌ ఇండియా చిత్రాలతో సంచలన విజయాలను నమోదు చేసుకున్నారు. కానీ క్రేజ్‌ విషయంలో సమంతతో పోల్చితే వెనకబడిపోయారు. తాజాగా ప్రముఖ సెలబ్రిటీ పోలింగ్‌ సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. మార్చి నెలలో ఇండియా వైడ్‌గా పాపులర్‌, క్రేజ్‌ని, అత్యంత అభిమానాన్ని పొందిన హీరోయిన్లలో సమంత నెంబర్‌ 1గా నిలవడం విశేషం.

Samantha first 4 Samantha,Trisha,Alia Bhatt,Rashmika,Kajal

 

టాప్‌ 10 మోస్ట్ పాపులర్‌ ఫీమేల్‌ స్టార్స్ లో సమంత మొదటి స్థానాన్ని దక్కించుకోగా, రెండో స్థానంలో అలియా భట్‌ నిలిచింది. ఆమె రెండేళ్ల క్రితమే కూతురుకి జన్మనిచ్చింది. ఇటీవల తరచూ భర్త్ రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె ముంబయిలో సందడి చేసింది. పైగా ఆమె సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొంటూ ఆకట్టుకుంది. ఇలా రెండో స్థానాన్ని దక్కించుకుంది.

ఇక మూడో స్థానంలో దీపికా పదుకొనె నిలవడం విశేషం. ఆమె గతేడాది వరుస సినిమాలు.. పటాన్‌, జవాన్‌చిత్రాలతో సంచలన విజయాలు అందుకుంది. ఇప్పుడు `కల్కి2898ఏడీ`లో నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఎదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతునే ఉంది. అయినా ఆమె మూడో స్థానానికే పరిమితం కావడం గమనార్హం.

Samantha first 2 Samantha,Trisha,Alia Bhatt,Rashmika,Kajal

ఇక నాల్గో స్థానంలో కాజల్‌ నిలిచింది. కాజల్‌ గతేడాది బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’ లో మెరిసింది. పెళ్లై, కొడుక్కి జన్మనిచ్చిన తర్వాత ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్ లో నటించిన తొలి చిత్రమది. ఆ తర్వాత ఆమె ఏ సినిమా ప్రకటించలేదు. కానీ నాల్గో స్థానంలో నిలవడం విశేషం. అయితే తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్లే ఆమెకి ప్లస్‌ అయింది.

ఇక ఐదవ స్థానంలో కత్రినా కైఫ్ నిలిచింది. ఈ భామ ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. అయినా కత్రీనా సీన్స్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.

Samantha first 1 Samantha,Trisha,Alia Bhatt,Rashmika,Kajal

రష్మిక మందన్నా గతేడాది `యానిమల్‌`తో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ‘పుష్ప2’ తో నటిస్తుంది. దీనిపై దేశ వ్యాప్తంగా డిస్కషన్‌ జరుగుతుంది. ఈ సినిమా కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. అయిన రష్మిక ఈ లేటెస్ట్ సర్వేలో ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె 3 సినిమాలతో బిజీగా ఉంది.

మరోవైపు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఏడో స్థానం పడిపోయింది. ఆమెకి సంబంధించిన వివాదాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్‌ మీడియాలోనూ ఆమెకి విపరీతమైన క్రేజ్‌ ఉంది. సినిమాలతోనూ సందడి చేస్తుంది. అయినా ఆమెకి ఏడో స్థానం రావడం గమనార్హం.

Samantha first 3 Samantha,Trisha,Alia Bhatt,Rashmika,Kajal

ఇక త్రిష ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ తరువాత ఆమె వరుస హిట్‌లతో దూసుకుపోతుంది త్రిష. ఆమె ఓ వైపు సినిమాలతో, మరోవైపు కొన్ని వివాదాలతోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో `విశ్వంభర` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో రెండు, మలయాళంలో రెండు మూవీస్‌ చేస్తుంది.

ఇక కీర్తి సురేష్‌ తొమ్మిదో స్థానంలో నిలిచింది. కీర్తిసురేష్‌కి తెలుగులో సినిమాలు లేవు. ఆమె తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఓ మూవీ చేస్తుంది. కృతి సనన్‌ పదో స్థానానికి పరిమితమయ్యింది. కృతి సనన్‌ హిందీలో బిజీగా ఉన్నారు. గతేడాది ఆది పురుష్ సినిమాతో పాటు గణ్ పథ్ చిత్రంలో నటించిన ఈమెకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!