HomeTelugu Trendingనాగ్ 100వ చిత్రంపై కొనసాగుతున్న నస్పెన్స్

నాగ్ 100వ చిత్రంపై కొనసాగుతున్న నస్పెన్స్

Akkineni Nagarjuna 100th mo

అక్కినేని నాగార్జున 99వ చిత్రంగా ‘నా సామి రంగా’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో కొరియో గ్రాఫర్ విజయ్ బెన్ని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మలయాళంలో విజయం సాధించిన ‘పోరంజు మరియం జోస్’ మూవీకి రీమేక్. గ్రామీణ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే రిలీజై మంచి స్పందనే అందుకుంది.

అక్కినేని నాగార్జున ఓ పక్క బిగ్ బాస్ 7 షూటింగ్ చేస్తూ మరోవైపు ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. షూటింగ్ త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ మూవీగా నా సామి రంగా తెరకెక్కుతోంది.

దీని తర్వాత నాగార్జున 100వ సినిమా గురించిన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా గతంలోనే ఒక లైన్ వినిపించాడు. నాగార్జునతో పాటు అఖిల్, నాగ చైతన్య కూడా ఉండేలా స్టోరీ బాగా వచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ తర్వాత పెండింగ్‌లో పడిపోయింది. ఇప్పుడు మోహన్‌ రాజా కూడా తమిళంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu