తండ్రి కోసం రిక్షా తొక్కిన బాలయ్య!

‘ఎన్టీఆర్’ బయోపిక్ బాలకృష్ణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం కోసం బాలయ్య చాలా కష్టపడుతున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రేపల్లెలో జరుగుతున్నది. అక్కడ కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. సాధారణంగా ఆదివారం రోజున షూటింగ్ కు సెలవు ఉంటుంది. కానీ, బాలకృష్ణ మాత్రం ఈ సినిమాకోసం విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నాడు.

ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. రేపల్లె రాజకీయాలకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని తలపై బ్రౌన్ కలర్ హ్యాట్ పెట్టుకున్న బాలకృష్ణ చూడటానికి ఇంచుమించుగా పెద్ద ఎన్టీఆర్ లాగే ఉన్నాడు. రిక్షా తొక్కుతూ స్టైల్ గా కనిపించిన బాలకృష్ణను చూసేందుకు రేపల్లెలోని ప్రజలంతా కదిలి వచ్చారు. ఇప్పుడు ఈ రిక్షా ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కాగా ఈ సినిమా రెండు పార్ట్స్‌గా విడుదల చేయనున్నారు. పార్ట్‌-1 ‘కథానాయకుడు’ టైటిల్ కాగా, సెకండ్ పార్ట్ కు ‘మహానాయకుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాదు సెకండ్ పార్ట్ సినిమాను జనవరి 24, 2018 న రిపబ్లిక్ డే పర్వదినం సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.