HomeTelugu Big Storiesఅల వైకుంఠపురములో..' టీజర్‌ వచ్చేసింది

అల వైకుంఠపురములో..’ టీజర్‌ వచ్చేసింది

10 7
టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురములో..’ మూవీ టీజర్‌ వచ్చేసింది. బుధవారం సాయంత్రం ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆకట్టుకునే సన్నివేశాలతో ఈ టీజర్‌ను రూపొందించారు. ‘మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్లు దాచారు నిన్ను..’ అనే ఫన్నీ డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్‌ ఎక్కా..’ అంటూ బన్నీ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. చివరి సన్నివేశంలో బన్నీ కోడిపుంజును ఎత్తుకున్న తీరు, ఆయన స్టైల్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు విశేషమైన స్పందన లభించింది. ‘సామజవరగమన..’ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu