అఖిల్ ఎంగేజ్మెంట్ పిక్ ఇదిగో!

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్, ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్ ను ప్రేమించినసంగతి తెలిసిందే. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో అఖిల్ కు, శ్రేయ భూపాల్ కుపెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా డిసంబర్ 9న వీరి నిశ్చితార్ధాన్ని జరిపించనున్నట్లుఅనౌన్స్ చేశారు. అన్నట్లుగానే కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లోని జీవీకే హౌస్ లో వీరి నిశ్చితార్ధం జరిగింది. కొద్ది మండి అతిథులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మీడియాను లోనికి అనుమతించకుండా నాగార్జున ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ నుండి చాలా తక్కువ మంది ఏ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో నాగార్జున, తన భార్య అమల కలిసి కొడుకు, కోడలితో దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

img-20161209-wa0047-1