HomeTelugu Trendingఅలీ ప్రధాన పాత్రలో 'అందరూ బావుండాలి'

అలీ ప్రధాన పాత్రలో ‘అందరూ బావుండాలి’

Ali new movie andaru bagun
ప్రముఖ హాస్య నటుడు అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి’. శ్రీపురం కిరణ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘మలయాళంలో విజయవంతమైన ‘వికృతి’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే 90శాతం షూటింగ్‌ పూరైంది. ఇటీవలే ఈ చిత్రంలోని ‘నా గుండె చిక్కుకుంది’ గీతాన్ని కశ్మీర్‌లోని పలు లొకేషన్లలో ఆరు రోజుల పాటు చిత్రీకరించాం. సినిమాలోని పాటలన్నీ భాస్కరభట్ల రచించారు అన్నారు. ఈ సినిమాలో నరేష్‌ సరసన పవిత్ర లోకేష్, అలీకి జంటగా మౌర్యాని నటిస్తున్నారు. తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu