HomeTelugu Big Storiesఅలీ సినిమాకి ప్రభాస్‌ విషెస్‌.. వీడియో వైరల్‌

అలీ సినిమాకి ప్రభాస్‌ విషెస్‌.. వీడియో వైరల్‌

Prabhas wishes to ali anda
టాలీవుడ్‌ హాస్య నటుడు అలీ నిర్మాత వ్యవహరిస్తూ.. ‘అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’. కిరణ్‌ శ్రీపురం దర్శకుడు. ఆలీ, నరేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘వికృతి’ చిత్రానికి తెలుగు రీమేక్ ఈ చిత్రం. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. కరోనా పరిస్థితులు చక్కదిద్దుకోగానే విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో మౌర్యానీ – మంజు భార్గవి – పవిత్ర లోకేశ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సందర్భంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి.. థియేటర్లలో మనందరం ఉండాలి” అని అన్నారు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వీడియోలో ప్రభాస్‌ కనిపించడంతో ఆయన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ‘డార్లింగ్‌’ ఇలాగైనా దర్శనమిచ్చాడని సంబరపడుతున్నారు. ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ తుది షెడ్యూల్‌ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. ఒక పాట, కొన్ని సన్నివేశాలు తీస్తే సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రాధేశ్యామ్‌’లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu