HomeTelugu Trendingరియా పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు: తాప్సీ

రియా పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు: తాప్సీ

I dont have any contact wi
బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ కేసుతో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడకంపై ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియా చక్రవర్తి జుడీషియల్ రిమాండ్ లో ఉంది. ఈ నేపథ్యంలో.. నటి తాప్సీ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి తరచూ వివాదాస్పదంగా మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత వారి వ్యాఖ్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని వ్యాఖ్యానించింది. ఇదే మాదిరి కంగనా రనౌత్ మాటలు కూడా తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేవని చెప్పింది.

రియా చక్రవర్తి గురించి మాట్లాడుతూ… రియా ఎవరో తనకు తెలియదని తాప్సీ తెలిపింది. రియాతో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పింది. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాను టార్గెట్ చేయడం, ఆమె పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధగా ఉందని తెలిపింది. బాలీవుడ్ సెలెబ్రిటీల్లో చాలా మంది ఏదో ఒక సమయంలో తప్పు చేశారని… అయితే, వారెవరినీ రియాను చూసినంత దారుణంగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu